27 March, 2026 | 4:45 AM

ఐపీఎల్ ఆరంభ వేడుకలు రద్దు

27-03-2026 02:07 AM
  1. చిన్నస్వామి ఘటన మృతులకు నివాళి
  2. బీసీసీఐ కీలక నిర్ణయం

బెంగళూరు, మార్చి 26 : ఐపీఎల్ -2026 సీజన్ శనివారం నుంచి మొదలవుతోంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడను న్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణ యం తీసుకుంది. ఆరంభ వేడుకలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు,  వారికి నివాళిగా బీసీసీఐ ఈ నిర్ణ యం తీసుకుంది.

ఈ ఏడాది ఎలాంటి  సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పా రు. గతేడాది జూన్ 4న జరిగిన విషాదకర సంఘటన మమ్మల్ని ఎంతగానో కలిచివేసింనీ, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి  గౌరవార్థం ఈసారి  ఓపెనింగ్ సెర్మనీ ని రద్దు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఎలాంటి వేడుకలు లేకుండానే ఐపీ ఎల్-19వ సీజన్ ప్రారంభమవుతుందని సైకి యా తెలిపారు.

ఇదిలా ఉంటే గత ఏడాది తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది అభిమానులకు కర్ణాటక క్రికెట్ అసోయేషన్, ఆర్సీబీ కూడా నివాళి అర్పించేందుకు సిద్దమయ్యాయి. వారి జ్ఞాపకార్థం స్టేడియంలోని ఒక స్టాండ్‌లో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచనున్నారు.  అంతర్జాతీయ మ్యాచ్‌లతో సహా, ఈ వేదికపై జరిగే అన్ని కార్యక్రమాల సమయంలో ఆ సీట్లు ఇకపై ఖాళీగానే ఉండనున్నాయి. ఆర్సీబీ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగనున్నారు.