22-11-2025 01:12:42 AM
పలు జిల్లాలకు నూతన ఎస్పీల నియామకం
కమిషనరేట్లలోనూ మార్పులు
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రభుత్వం భారీగా మార్పులు, చేర్పులు చేసింది. మొత్తం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో పలువురు సీనియర్ అధికారులతో పాటు, పలు జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం, కమిషనరేట్లలో డీసీపీ పోస్టుల్లో మార్పులు జరిగాయి.
సీనియర్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్ మల్టీజోన్-2 ఏడీజీపీ నుంచి డీజీపీ కార్యాలయంలో ఏడీజీపీ పర్సనల్‌గా బదిలీ అయ్యారు. జే పరిమళ హానా నూతన్ హైదరాబాద్ జాయింట్ సీపీ అడ్మిన్ నుంచి సీఐడీ డీఐజీగా బదిలీ అయ్యారు. ఎస్ శ్రీనివాస్ వెయిటింగ్ ఎస్పీ నుంచి టీజీ ట్రాన్స్‌కోగా నియామకమయ్యారు.
జిల్లాల కొత్త ఎస్పీలు
నాగర్‌కర్నూల్- పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపత్రావ్
మహబూబాబాద్- డాక్టర్ శబరీష్ పి
కుమ్రంభీం ఆసిఫాబాద్- నితికా పంత్
వికారాబాద్- శ్రీమతి స్నేహా మెహ్రా
ములుగు- కేకన్ సుధీర్ రామ్‌నాథ్
జయశంకర్ భూపాలపల్లి- శిరిశెట్టి సంకీర్త్
వనపర్తి- డి. సునీత
హైదరాబాద్ కమిషనరేట్
డీసీపీ, సౌత్ జోన్- శేఖరే కిరణ్ ప్రభాకర్
డీసీపీ, టాస్క్‌ఫోర్స్- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
డీసీపీ- చెన్నూరి రూపేష్
రాచకొండ కమిషనరేట్
డీసీపీ, మహేశ్వరం జోన్- కె నారాయణరెడ్డి
డీసీపీ, మల్కాజ్‌గిరి- సిహెచ్ శ్రీధర్
డీసీపీ, క్రైమ్స్- కె గుణశేఖర్
రామగుండం కమిషనరేట్
డీసీపీ, పెద్దపల్లి- బి రామ్‌రెడ్డి
ఇతర ముఖ్య బదిలీలు
పాటిల్ కాంతిలాల్ సుభాష్ గవర్నర్‌కు ఏడీసీగా బదిలీ అయ్యారు. ఆర్ గిరిధర్ తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా బదిలీ అయ్యారు. పివి పద్మజ తెలంగాణ యాంటీ-నార్కో టిక్స్ బ్యూరోలో ఎస్పీ అడ్మిన్‌గా నియమితులయ్యారు. పలువురు యువ ఐపీఎస్‌లు, ఏఎస్పీలు, ఎస్డీపీఓలను కూడా వివిధ ప్రాంతా లకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పాలన సౌలభ్యం, శాంతిభద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకే ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది.