22-11-2025 01:33:40 AM
హైదరాబాద్, నవంబర్ 21 (విజయ క్రాంతి): అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూ భారతి ‘భూమేత’ అయ్యిందా అని మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. భూ భారతి.. భూ హారతిగా మారిందా?, కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ బ్రో కర్లకు మంగళ హారతి అయ్యిందా అని ఎద్దేవా చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ప్రభుత్వ తీరు ఉందని, భూ భా రతి మీరు తెచ్చిన రెవెన్యూ చెత్త సంస్కరణ అని సీఎం రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.
‘ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు. రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం’ అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి... మీ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద, తహసీల్దార్ కార్యాలయాల వద్ద, కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యా యత్నా లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘ధరణి’ పై అడ్డగోలుగా మాట్లాడి మీరు గొప్పగా తెచ్చిన ‘భూ భారతి’ భూ ముల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైందని నిలదీశారు.
అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్క రిస్తాం అన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. భూ ముల రికార్డులు సరిచేస్తామని, రైతుల హక్కులు కాపాడతామని రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా సాదాబైనామా దరఖాస్తుదారులు ఎందుకు పరిష్కరించడం లేదని, కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెసు లుబాటు కల్పించడం లేదని మండిపడ్డారు.
ఆపదకో, అవసరా నికో ఉన్న భూములు అమ్ముకోలేక.. అధిక వడ్డీకి రుణాలు తీసు కోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేష న్‌ల పేరిట మధ్యవర్తులు, ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు..రైతుల నుంచి అక్రమ వసూ ళ్లకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్న ట్టు అని ప్రశ్నించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 700 పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయా రని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవె న్యూ శాఖ మేలుకుని, పెండింగ్‌లో ఉన్న భూ దరఖాస్తులను వెంటనే పరిష్కరిం చాలని, డిమాండ్ చేశారు.