calender_icon.png 22 November, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంత సమయం ఇవ్వండి

22-11-2025 01:08:40 AM

  1. వివరణ ఇచ్చేందుకు స్పీకర్‌ను కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి 
  2. సానుకూలంగా స్పందించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్! 

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో ఒకరైన కడియం శ్రీహరి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను స్వ యంగా కలిసారు. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని ఆయన ఓ లేఖలో స్పీకర్‌కు విజ్ఞపి చేశారు. అందుకు స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు స్పందిస్తూ స్పీకర్ న్యూఇ యర్ ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇం దులో భాగంగా ఇప్పటి వరకు విచారణకు హాజరుకాని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

స్పీకర్ కడియం శ్రీహరి ఈ నెల 23వ తేదీన హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. రాష్ర్టంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో గడువుకు ముందుగానే స్పీకర్‌ను కలిసిన కడి యం, తనపై వచ్చిన ఫిర్యాదులకు సం బంధించిన పూర్తి వివరణ సిద్ధం చేయడానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు.

ఇదే కేసులో మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఆయన 23వ తేదీన హాజరవుతారా..? లేదా అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్  తీసుకోబోయే నిర్ణయాలు, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.