15 June, 2026 | 7:45 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

స్పెల్ బి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఐపీఎస్ విద్యార్థులు

28-02-2026 04:45 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): స్పెల్ బి రాష్ట్రస్థాయి పోటీలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని  ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. విశ్వం హెడ్ టెక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి సెల్ఫీ బి పోటీలలో సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి  ఆదివారం నిజాంబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఎంపికైన వారిలో ఏం సంచిత్ మూడవ తరగతి, వి తనీష్ రావు ఐదవ తరగతి, ఎం సాహితీ ఎనిమిదో తరగతి విద్యార్థులు ఉన్నారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా విద్యార్థులు మరింత ప్రతిభ చూపాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.