28 February, 2026 | 7:08 PM

లేడీస్ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా "ప్రపంచ టైలర్స్ డే" వేడుకలు

28-02-2026 04:50 PM

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని  లేడీస్ టైలర్ అసోసియేషన్ సభ్యులు శనివారం ఉత్సాహభరితంగా వేడుకలు నిర్వహించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లేడీస్ టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగర్ శ్రీను మాట్లాడుతూ ముందుగా ప్రపంచ టైలర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికా దేశంలో 1819లో జన్మించిన విలియమ్స్ చిన్న వయసులోనే 1845లో కుట్టు మిషన్ రూపొందించి, ఫిబ్రవరి 28న ప్రపంచానికి అంకితమిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కుట్టు వృత్తి ద్వారా ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని, ఈ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం టైలర్ డే నిర్వహించడం గర్వకారణమన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వాసం భూమేశ్వర్, అధ్యక్షులు సింగర్ శ్రీను, కోశాధికారి పాషా, ప్రధాన కార్యదర్శి కోడం సురేష్, ఉపాధ్యక్షులు గొడిసెల ఆశ, ప్రచార కార్యదర్శి సతీష్, యూనియన్ సభ్యులు గణేష్, భాగ్యశ్రీ, మానస తదితరులు పాల్గొన్నారు.టైలర్ వృత్తి ప్రతిష్టను పెంపొందించేందుకు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని అసోసియేషన్ నాయకులు తెలిపారు.