25 June, 2026 | 3:24 PM

Breaking News

మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్   •   తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.   •   దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం   •   ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి   •   విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు   •   నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి   •   కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు   •   పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు   •   చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు   •  

యువతలో శాస్త్రీయ చైతన్యం

28-02-2026 04:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని విజయ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే  చైర్మన్ నల్ల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు సైన్స్ విజ్ఞానం ప్రాథమికను తెలిపారు మాట్లాడుతూ ఈ రోజు శాస్రవేత్త C. V. Ramanని స్మరించుకునే రోజు 1928 ఫిబ్రవరి 28న ఆయన “రామన్ ప్రభావం” (Raman Effect) అనే గొప్ప ఆవిష్కరణని కేవలం రూ.200తో చేశారని,ఇందుకు గాను 1930లో ఆయన నోబెల్ బహుమతి అందుకున్నారని,ఆయన విజయం భారతదేశానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.

ఈ పూర్వ విద్యార్థులు పాఠశాల సిబ్బంది, కౌన్సిలర్స్ అయిండ్ల విజయలక్ష్మి, చెనిగారపు నరేష్ లు విశిష్ట అతిథులుగా హాజరై, తమ పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదివి విదేశాలలో ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థాయిలో ఉన్నారని ఇలాంటి పాఠశాల వల్లనే వాళ్ళు ఈ స్థాయికి చేరారని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా అతిథులందరిని యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల జనరల్ సెక్రెటరీ అయ్యన్నగారి భూమయ్య, వైస్ ప్రెసిడెంట్ అంబారాణి, కోశాధికారి ఆడేపు  సుధాకర్, కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణం, ప్రిన్సిపాల్ సామ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొనారు.