5 August, 2026 | 10:39 AM

ఇరాన్ అధ్యక్షుడు మిస్సింగ్

20-05-2024 02:32 AM

ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

హెలికాప్టర్ కోసం వెతుకున్న సహాయక సిబ్బంది

దుబాయ్, మే 19: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయింది. ఇరాన్‌లోని జోల్ఫాలోని పర్వత ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది. ఇది ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన పొగమంచు ఉండటంతో హెలికాప్టర్ ఆచూకీ లభించలేదు. ఆయన హెలికాప్టర్‌ను గుర్తించేందు కు రెడ్ క్రెసెంట్  సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో సహా యక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఇబ్రహీం అజర్‌బైజాన్‌లోని ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన హెలికాప్టర్ కాన్వాయ్‌లో మూడు హెలికాప్ట ర్లు ఉన్నాయి. మంత్రులు, ఇతర అధికారులు ఉన్న రెండు హెలికాప్టర్లు టెహ్రాన్ చేరుకోగా, అధ్యక్షుడు ఇబ్ర హీం, మరో మంత్రి ఉన్న హెలికాప్టర్ మాత్రం క్రాష్ ల్యాండ్ అయింది.