17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బ్రిడ్జిపై తేలిన ఇనుప చువ్వలు.. పొంచి ఉన్న ప్రమాదం

05-06-2025 01:13 AM

మరమ్మతులు చేయాలని కోరుతున్న ప్రజలు

బూర్గంపాడు, జూన్ 4 (విజయక్రాంతి): కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్లే జాతీయ రహదారిలో అంజనాపురం-జింకలగూడెం గ్రామాల మధ్య సీతారామ కాలువపై నిర్మించిన వంతెనపై సిమెంట్ బెడ్డు తొలగిపోయి ఇనుపచువ్వలు పైకితేలాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇను పచువ్వలు ప్రమాదకరంగా ఉన్నాయని వా పోతున్నారు.

నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాం తంలో ఏమాత్రం అక్కడ ఏమరుపాటును ప్రదర్శించినా తేలిన ఇనుపచువ్వలు టైర్లకు తగిలి టైర్లు పగిలిపోయే ప్రమాదముందనీ ,ప్రాణాపాయం జరగకముందే అధికారులు స్పందించి బ్రిడ్జిపై మరమ్మతులు చేసి దాని పైన సిమెంట్ బెడ్డువేయాలని వాహనదారులు కోరుతున్నారు.