28 April, 2026 | 5:02 PM

Breaking News

అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరుపై ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు   •   దేవరకొండలో కళాశాల గోడపత్రిక ఆవిష్కరణ   •   దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. నలుగురు కో-ఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక   •   బేగంపేట్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన సన్మానం   •   నిలిచిపోయిన నీటి దారులు   •   బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్   •   సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ   •   గుగ్గిళ్ళ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలి: ఉద్యోగుల జేఏసీ   •   పరీక్షల్లో అనుత్తీర్ణులు అయిన విద్యార్థులు నిరాశ చెందకూడదు   •   కొల్చారం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: 15 మందికి గాయాలు   •  

కలెక్టర్ సార్... అవినీతిపై విచారణ జరిపించండి.

28-04-2026 03:11 PM

కొనుగోలు సెంటర్లో అంతా నా ఇష్టమే, అంటున్న నిర్వాహకురాలు సరళ రెడ్డి

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకురాలు ఇస్తారాజ్యంతో ప్రవర్తించి, రైతులకు ఇబ్బందుల గురి చేస్తున్న సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కోడూరు గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో నిర్వాహకురాలు సరళ రెడ్డి, ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కి, రైతుల ఒడ్లు పూర్తిస్థాయిలో ఎండబెట్టకుండా, ముందు కళ్ళములో పోసిన వడ్లను వదిలిపెట్టి, పట్టని వోడ్లకు, కాంటాలకు నిర్వహించి, లారీలలో ఎగుమతి చేయడంతో, మిల్లులో దిగుమతి అయిన తర్వాత, కాంటాలో తేడాలు వచ్చి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐకెపి సెంటర్లో ఒక బస్తాకు 41 కేజీల 200 గ్రాములు, తూకం పెట్టవలసి ఉండగా, కొందరి రైతుల ఇష్టం మేరకే 42 కేజీల 200 తూకం పెట్టినట్లు నిర్వాహకురాలు ఒప్పుకున్నారు. ప్రస్తుత సీజన్లో 41 కేజీలకే బస్తా పూర్తిగా నిండి, ఒడ్లు బయటపడుతున్నాయి. బయటపడ్డా వడ్లను అదే లారీలో పోయేకపోవడంతో తూకంలో తేడా వచ్చి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. దీనితో కొంతమంది రైతులు నిర్వాహకుల మధ్య లొల్లి జరిగింది. జరిగిన సంఘటన పట్ల రెవెన్యూ అధికారులు విచారణలు జరుపుతున్నారు. కోడూరు ఐకెపి కేంద్రంలో నిర్వాహకురాలు చేస్తున్న అవకతవకలపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, రైతులకు న్యాయం చేయాలని, బాధిత రైతులు కోరుతున్నారు.