ఫోర్‌లైన్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి
* మర్రి నిరంజన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఖానాపూర్ గేట్ నుండి మాల్ వరకు సెంట్రల్ లైటింగ్, డివైడర్‌తో కూడిన ఫోర్‌లైన్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని మర్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరారు. నాగార్జునసాగర్ వెళ్తున్న మంత్రికి ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఆయన ఘన స్వాగతం పలికి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందించారు.ఈ రహదారిపై నిత్యం ట్రాఫిక్ పెరగడంతో పాటు ప్రమాదాలుచోటుచేసుకుంటున్నాయని, ఇటీవల తక్కలపల్లి వార్డు మెంబర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్ సిలిండర్లు అందించాలని కోరగా, వెంటనే కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి హెచ్‌ఏఎమ్ నిధులు కేటాయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఏసీపీ కె.పి.వి. రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






