10 August, 2026 | 4:37 PM

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

10-08-2026 03:31 PM

దమ్మపేట, ఆగస్టు 10(విజయక్రాంతి): మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా మండలంలో జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సిఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు.  సిఐటియు మండలకన్వీనర్ మురహరి రఘు అధ్యక్షతన జరిగిన సభలో ఎస్ కే యం జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ లక్ష్మీనారాయణ, మాస్ లైన్ మండల నాయకులు పండూరు వీరబాబు మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, మతోన్మాద విధానాల వలన ప్రజా సమస్యలు రోజురోజుకు పెరిగి ప్రజలు భరించలేని పరిస్థితికి చేరుకుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే కార్మిక, కర్షక, కష్టజీవులు ఐక్యమై మోడీ గద్దె దించటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా నాయకులు మోరంపూడి శ్రీనివాసరావు, సిఐటియు మండల నాయకులు కవులూరి రామకృష్ణ, శారద, రజని, శ్రీలత, జ్యోతి, సత్యవతి, జయ, విజయలక్ష్మి, రామలక్ష్మి, వజ్రమ్మ, బత్తుల శ్రీను, రైతు సంఘం నాయకులు కేశవరావు, అప్పారావు, పిల్లి నాయుడు, శోభన్ బాబు, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.