10 August, 2026 | 4:38 PM

ఫీజు రాయితీలపై మల్లారెడ్డితో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్చ

10-08-2026 03:34 PM

ఉప్పల్, ఆగష్టు 10విజయక్రాంతి: ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులకు మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల్లో(Malla Reddy Engineering Colleges) ఫీజు రాయితీలు కల్పించే అంశంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshma Reddy) మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పలువురు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి ఫీజు రాయితీలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బండారి లక్ష్మారెడ్డి కోరారు. ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఈ రాయితీలు ఉపయోగపడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కూడా విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, సాధ్యమైన మేరకు సహకారం అందించేందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా అవకాశాలు మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఇద్దరు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు.