10 August, 2026 | 4:34 PM

వరుణయాగంలో పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు

10-08-2026 03:27 PM

నాగార్జునసాగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సోమవారం నాడు నాగార్జునసాగర్ లో పర్యటిస్తున్నారు. సాగర్ లో జరుగుతున్న వరుణయాగంలో(Varuna Yagam) సీఎం రేవంత్ పాల్గొన్నారు. వరుణయాగం పూర్ణాహుతిలో రేవంత్ దంపతులు పాల్గొన్నారు. సాగర్ లో విజయ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో వరుణయాగం జరుగుతోంది. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం  'వరుణ యాగం' నిర్వహిస్తోంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి ఎన్. పద్మావతి నల్గొండ జిల్లాలో జరిగిన 'వరుణ యాగం'లో పాల్గొన్నారు.