15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భారత సార్వభౌమత్వానికి అమెరికా సవాల్?

14-05-2025 12:00 AM

ఇదంతా సరే.. ఇదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను. లేదంటే మాతో మీరు ఎలాంటి వాణిజ్యం చేయలేరని రెండు దేశాలకు చెప్పా. అలా అణు యుద్ధాన్ని ఆపేశా. లేదంటే రెండు దేశాల మధ్య అణ్యు యుద్ధం వచ్చేది’ అని ప్రకటించాడు. పాకిస్థాన్‌కు వేరే దారి లేదు. భారత్‌తో పోరాడం లేం అనుకొని కాల్పులు విరమించుకుని ఉండవచ్చు. మరి భారతీయులు ఆ ప్రకటన విని సంతోషించాలా? లేదా బాధపడాలా? 

ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం దేశప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చాలా ప్రధానమైంది. మోదీ ఎన్నో అనుమానాలకు జవాబిచ్చే ప్రయత్నం చేశారు. పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రతి రాజకీయ పార్టీ స్వాగతించిందని, యావత్ భారత ప్రజలు మద్దతు పలికారని చెప్పుకొచ్చారు. ‘ఉగ్రవాదులను తుదముట్టించేం దుకు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛని చ్చాం.

మన సోదరీమణులు, మన కుమార్తెల నుదుటి నుంచి సిందూరం తొలగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు ప్రతి ఉగ్రవాదికీ, ప్రతి ఉగ్రవాద సంస్థకూ తెలిసొ చ్చిం ది’ అని, ‘ఉగ్రవాదం,- చర్చలు ఒకేసారి సా ధ్యం కావు. ఉగ్రవాదం, వాణిజ్యం కూడా ఒకేసారి సాధ్యం కావు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’ అని కూడా ప్రకటించారు. ఇదంతా సరే.. ఇదే రోజు అమెరికా అ ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘భారత్ మ ధ్య యుద్ధాన్ని నేనే ఆపాను.

లేదంటే మా తో మీరు ఎలాంటి వాణిజ్యం చేయలేరని రెండు దేశాలకు చెప్పా. అలా అణు యు ద్ధాన్ని ఆపేశా. లేదంటే రెండు దేశాల మ ధ్య అణ్యు యుద్ధం వచ్చేది’ అని ప్రకటించాడు. పాకిస్థాన్‌కు వేరే దారి లేదు. భారత్ తో పోరాడంలేం అనుకొని కాల్పులు విరమించుకుని ఉండవచ్చు. మరి భారతీయు లు ఆ ప్రకటన విని సంతోషించాలా? లేదా బాధపడాలా? ట్రంప్ ప్రకటన భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేసినట్లు కాదా? 

పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నామా?

పాకిస్థాన్‌ను కాళ్లబేరానికి రప్పించామని మనం అంటున్నాం. ఉగ్రమూకలను తుదముట్టించి తీరుతామంటున్నాం. పాక్ మాత్రం మనకంటే ముందే భారత్‌పై విజయం తనదేనని నిర్మొహమాటంగా ప్రకటించుకున్నది. కానీ పాకిస్థాన్‌లో మసూద్ అజర్, హఫీజ్ సయీద్ వంటి ముష్కరులు భారత్‌కు సవాల్ విసురుతూనే ఉన్నారు. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని మోదీ అంటున్నారు. అయితే..

ఇకముందు ఉగ్ర మూక లు దాడులకు తెగబడవా? వారి నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది. మే 12న జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ‘లష్కర్ ఏ తోయిబా’ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు మృతిచెందారు.

ఈ దాడికి ముందు ఇదే నెల  8వ తేదీ రాత్రి సాంబా జిల్లా పరిధిలోని దేశ సరిహద్దు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు చొరబడేందుకు యత్నించారు. వారందరినీ భారత భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. చొరబాటుదారులంతా ‘జైషే మహమ్మద్’ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారని తర్వాత తెలిసింది.

ఇలా ఎప్పటికప్పుడు పాక్ ప్రభుత్వంతో పాటు ఉగ్రవాద సంస్థలు భారత్‌ను కవ్విస్తున్న ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు ఇకపై భారత్‌లో ముష్కరుల దాడి కారణంగా ‘ఒక్క ప్రాణం కూడా పోదు’ అని ధీమాగా ఉండగలమా?

స్వేచ్ఛకు పరిమితులుంటాయ్..

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనప్పుడు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాతలు సరికాదు. మనకు వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందన్న మాట వాస్తవమే. కానీ.. అవి భారత రాజ్యాంగం ఇచ్చిన విలువైన హక్కులు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ (ఆర్టికల్ 19(1ఎ)) ప్రకారం ప్రతి పౌరుడు తన అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించే హక్కు ఉంది.

తన విశ్వాసాలను నిర్భయంగా మాట్లాడే హక్కు ఉంది. అది మౌఖికంగానైనా. రాత పూర్వకంగానైనా. లేదా ఇతర ఏ పద్ధతుల్లోనైనా ఆ స్వేచ్ఛను వినియోగించుకోవచ్చు. కానీ.. ఆ స్వేచ్ఛను విచక్షణా రహితంగా, ఆలోచనా రహితంగా వినియోగించుకోవడం మరో దుర్మార్గమే అవు తుంది. ప్రజలు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించవచ్చు.నిరసన కార్యక్రమా లు చేపట్టవచ్చు.

చట్టబద్ధమైన వృత్తి లేదా వ్యాపారం ఏదైనా చేసుకోవచ్చు. ఆ చర్యలన్నీ దేశ సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతకు భంగం కలిగించకూడదు. ప్రజాశాంతికి, నైతికతకు విరుద్ధంగా ఉండకూడదు. మతం, జాతిపరమైన వైషమ్యా లను పెంచకూడదు. భావవ్యక్తీకరణ హక్కు ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి,  సమాజంపై ప్రభావాన్ని చూపడానికి సహాయపడతాయి. స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వాడుకోవాలి.

మీడియాకు ఏ బాధ్యతా లేదా? 

పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ‘ఎక్స్’ అకౌంట్‌ను భారత్ నిషేధించింది. అలాగే పలువురు పాకిస్థాన్ జర్నలిస్టులు, ఆదేశ రక్షణశాఖ ‘ఎక్స్’ ఖాతాలనూ బ్లాక్ చేసింది. ఇదే క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన 16 యూ ట్యూబ్ చానళ్లతో పాటు ఆ దేశ ఓటీటీలను సైతం నిషేధించింది. నిషేధిత చానెల్ జాబితాలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉంది. 

కశ్మీర్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతోనే భారత్ ఇలాంటి చర్యలు చేపడుతున్నది. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం 2021లోని నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నది. అయితే.. ఇటీవల కేంద్రం  ‘ది వైర్’ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడంపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్థాన్ నుంచి వచ్చే కథనాలను ఆ వెబ్‌సైట్ నుంచి తొలగించాలనే ఆదేశాలు న్నాయి. నిషేధిత వెబ్‌సైట్ల జాబితాలో ‘ది వై ర్’ వంటి వెబ్‌సైట్‌ను చేర్చడం న్యాయం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా అభిప్రాయపడ్డారు. అలాగే ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ తరఫు న్యాయవాది, ఫౌండర్ డైరెక్టర్ అపర్ గుప్తా సైతం ‘ది వైర్’ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మరింత జాగ్రత్త అవసరం.. 

ఫేక్ న్యూస్ కూడా దేశ సమగ్రతకు ప్రమాదం. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్‌పై ఆత్మాహుతి దాడి జరిగినట్లు ఇటీవల ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రసారమయ్యాయి. దాడి జరిగినట్లు వార్తలు ప్రసారమవుతున్న ఏడు వీడియోలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. చివరకు ఆ వార్తల్లో వాస్తవం లేదని, ఆ వీడియోలు ఫేక్  అని తేల్చింది.  అలాగే పంజాబ్‌లోని జలంధర్‌పై డ్రోన్ అటాక్ జరిగినట్లు వచ్చిన వార్తలు కూడా ఫేక్ అని ప్రకటించింది.

ఇలా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ నిజానిజాలను  ప్రజల కు చెప్పడం ఎంతో మేలు చేస్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) చాలా సమర్థంగా పనిచేస్తుదనడానికి పై విషయాలే నిదర్శనం. ప్రజలు ఫేక్ వార్తలు నమ్మొ ద్దు.  వాస్తవం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా పోస్టులు పెడుతున్నారు.

వీడియోలు షేర్ చేస్తున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు పీఐబీ ప్రకటనలు చదవితే మేలు.  చదవడమే కాదు.. పుకార్లు లేదా ఫేక్ న్యూస్‌ను ఎదుటి వారికి తెలియజెప్పాలి. అలాగే సైనికులు కుటుంబాలకు అండగా నిలవాల్సిన సందర్భం ఇది. ముఖ్యంగా యుద్ధంలో పాల్గొని అమరులైన వారి కుటుంబాలకు బాసటగా నిలవాలి.