కశ్మీర్ సమస్యకు చెల్లు
భారత్, పాకిస్థాన్ మధ్య ఇక చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పైనే ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ స్పష్టం చేశా రు. ఇరుదేశాల మధ్య కశ్మీర్ ఇకపై చర్చనీయాంశంగా ఉండదనేది ఆయన చెప్పకనే చెప్పారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలతో భారత విదేశాంగ విధానంలో వచ్చిన పెద్ద సవరణ ఇది.
ఇంతకాలం ద్వైపాక్షిక చర్చల్లో తేల్చుకోవాల్సిన సమస్య, ఇకపై రెండు దే శాల మధ్య సమస్య కానేకాదనేది ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్థాన్‌కు భారత్ స్పష్టం చేసినట్లయింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన వేళ కశ్మీర్‌పై భారతీయులంతా దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ‘ఆపరేషన్ సిందూర్’లో పైచేయి సాధించిన భారత్ అదే ఊపులో గిల్గిత్, బలూచిస్థాన్‌ను కూడా పాకిస్థాన్ నుంచి విముక్తం చేయాలన్న ఆవేశం సగటు భారతీయుడిలో కనిపించింది.
ఇలాంటి సందర్భంలో ‘మోదీని ఫైర్ అనుంకొంటివా.. సీజ్ ఫైర్’ అని అలవోకగా సోషల్ మీడి యా వారియర్స్ జోకులు వేసుకోవడం గర్హనీయం. భావోద్వేగాల ప్రాతిపదికనే పొరుగు దేశంతో యూద్ధానికి పాల్పడితే పరిణామాలు ఎంతదా కా ఉంటాయనేది సైన్యానికి, విజ్ఞులకు మాత్రమే తెలుసు. యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదని ఒక మాజీ సైనికాధికారి కటువుగా చెప్పిన మా టలు ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలి.
సుందర కశ్మీరం మనది, ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ దానిని వదలుకోవద్దు అనేది మొదటినుంచి ఉన్న భావనే. మరి కశ్మీర్‌లో అంత హింస ఎందుకు జరిగింది? దానికి కారణమెవ్వరు? అని కూడా ఈ తరం ఆలోచించాలి. కశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే ఏ ర్పడుతున్న సాధారణ పరిస్థితుల్లో తూటా పేల్చాలనే పాకిస్థాన్ అండతో పహల్గాంలో ఉగ్రమూక చెలరేగింది.
కశ్మీర్ తిరిగి అశాంతి పరిస్థితులు తలెత్తాలని, అప్పుడు ఎల్వోసీ వద్ద ఉద్రిక్త వాతావారణాన్ని సృష్టించి వేసవిలో ఉగ్రమూకలను కశ్మీర్‌లో చొరబడేలా చూడాలని, పాకిస్థాన్‌లో టెర్రరిస్టులకు నాయకత్వం వహించే అక్కడి ఆర్మీ పన్నాగం. పహల్గాం ఘటన ఆం దులో భాగమే. ఇక దేశంలో ఎక్కడ పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగినా భా రత్ కఠినంగానే వ్యవహరించాలి.
ఉగ్రవాదులు ఎక్కడున్నా భారత ఆర్మీ వేటాడుతుందన్న సంకేతం బలంగా ఉన్నప్పుడే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయి. ఎల్వోసీ, ఐబీల వద్ద రెప్పవేయకుండా నిఘా ఇ ప్పుడు అత్యవసరం. ఉగ్రవాదుల్లో ఒక్కడూ కూడా సరిహద్దు దాటి రాలేడనే నమ్మకమే కశ్మీర్ ప్రజలకు మనోధైర్యాన్ని ఇస్తుంది. అందుకు పహ ల్గాం ఘటనలో జరిగిన భద్రతా వైఫల్యాలను సమీక్షించుకోవాలి.
స్థానిక ఇంటెలిజెన్స్‌ను పెంచుకోవాలి. ప్రజల్లో విశ్వాసం కలిగించే దిశగా ప్రభుత్వ పాలన సాగా లి. ఎల్వోసీ వెంబడి పౌరులు దాదాపు రెండు వారాల పాటు పాకిస్థాన్ షెల్లింగ్‌తో నరకం చూశారు. వారి జీవనం సాఫీగా సాగేందుకు అన్ని చర్చ లు తీసుకోవాల్సి వుంటుంది.
వారికి ఇకపై పూర్తి రక్షణ అవసరం. పాకిస్థాన్ పన్నాగాలను తిప్పికొట్టాలంటే ముందుగా కశ్మీర్‌లో ఉపాధి, భద్రత పెంచాలి. గత చరిత్ర గాలికిపోని. భారత్‌లో అంతర్భాగంగా, తామూ భారతీయులమేనని ప్రగాఢ విశ్వాసం కశ్మీరీలందరిలో కలిగినప్పుడే ‘కశ్మీర్ సమస్య’కు నిజమైన పరిష్కారం.






