బౌద్ధం మతం కాదు.. జీవన విధానం
బౌద్ధం ముఖ్యంగా మతరంగాన్ని విప్లవీకరించింది. అర్ధం లేని కర్మకాండలు, మూఢ నమ్మకాలు, జంతుబలులతో భ్రష్టుపట్టిన మతాన్ని సంస్కరించి నైతికతను, మానవీయ విలువలను జోడించింది. భారతదేశంలో అనాదిగా పాతుకుపోయిన కుల వ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత అనే అనాగరిక శిక్షల నుంచీ సమాజానికి విముక్తి కలిగించింది. బౌద్ధం భారతీయ చరిత్ర, సంస్కృతిని కూడా ప్రభావితం చేసింది.
క్రీ.పూ.6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాల్లో ఒకటైన బౌద్ధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బౌద్ధం మతం కాదు. ఒక జీవన విధానం. ఇంకా చెప్పాలంటే.. బౌద్ధం మానవీయ మత సంస్కర ణ వాదం అని చెప్పవచ్చు. భారతదేశంలో మానవత్వాన్ని ప్రబోధించి, సమానత్వాన్ని చాటిన బౌద్ధానికి ఆద్యుడు సిద్దార్థుడు. ఆయనే మహామానిషి గౌతమ బుద్ధుడు. క్రీ.పూ.563లో కపిలవస్తు నగర సమీపంలోని లుంబినిలో బుద్ధుడు జన్మించాడు.
తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి. సి ద్దార్థుడు పుట్టిన తర్వాత తల్లి మరణించడంతో ఆయన్ను సవతి తల్లి ప్రజాపతి గౌతమి పెంచింది. అందుకే అతడిని గౌతముడు అని కూడా అంటారు. ఒక రోజు బుద్ధుడు దారిలో ప్రయాణిస్తుండగా ము సలివాడిని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూసి అంతర్మథనానికి గురవుతాడు. అ నంతరం అతడికి దేహం అశాశ్వతమని తో చి ప్రాపంచిక సుఖాలను వదిలేశాడు. తన 29వ ఏట మహాభినిష్ర్కమణం చేశాడు.
గయలో బోధి వృక్షం కింద ఆయనకు జ్ఞా నోదయం అయింది. వైదిక మతంలోని అణచివేత నుంచి దళిత , పీడిత, అట్టడుగు వర్గాలను విముక్తి చేశాడు బుద్ధుడు. స్త్రీ, పురుషులిద్దరిని సమానంగా చూశాడు. సామ్యవాద విలువలతో సమాజాన్ని విప్లవీకరించాడు. బుద్ధుని ఉపదేశంలో నాలు గు గొప్ప సత్యాలు ఉన్నాయి. అవీ లోకం దుఃఖమయం, దుఃఖానికి మూలం కోరిక, కోరికను నివారించడం ద్వారా దుఃఖాన్ని నివారించవచ్చని, అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా కోరికలను నివారించవచ్చన్నాడు.
అష్టాంగ మార్గంలో సరైన దృష్టి, సరైన ఆలోచన, సరైన వాక్కు, సరైన క్రియ, సరైన జీవనం, సరైన సాధన, సరైన స్మృతి, సరైన ధ్యానం వంటి ఎనిమిది శాస్త్రీయ పరిష్కారాలు చూపాడు. వీటిని చక్కగా ఆచరించడం ద్వారా సంపూర్ణ విశ్వ మానవుడిగా మారగలం. ఇవీ నేటికీ ఆచరణీయమైనవి.
మానవ విలువలు కలిగిన బౌద్ధం అశోకుడు వంటి గొప్ప రాజుల ఆదరణకు నోచుకొన్నది. దీంతో సామాన్య జనులకు దగ్గరైంది. బుద్ధుడు సరళమైన తాత్వికత, ఆచరణాత్మక విధానాలు భారతదేశంలో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. బౌద్ధం చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతోంది.
బౌద్ధం విమోచన సాధనం..
బౌద్ధం ముఖ్యంగా మతరంగాన్ని విప్లవీకరించింది. అర్ధం లేని కర్మకాండలు, మూఢ నమ్మకాలు, జంతుబలులతో భ్ర ష్టుపట్టిన మతాన్ని సంస్కరించి నైతికతను, మానవీయ విలువలను జోడించింది. భా రతదేశంలో అనాదిగా పాతుకుపోయిన కుల వ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత అనే అనాగరిక శిక్షల నుంచీ సమాజానికి విముక్తి కలిగించింది. బౌద్ధం భారతీయ చరిత్ర, సంస్కృతిని కూడా ప్రభావితం చేసింది.
సామాన్య ప్రజలకు చేరువయ్యే క్రమంలో పాళీ వంటి ప్రజల భాషల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించింది. బౌద్ధం గొ ప్ప వాస్తు శిల్పకళల ను ప్రోత్సహించింది. బౌద్ధం సామాన్య ప్రజల విశ్వాసాలను ఆ చారాలను తనలో కలుపుకుంటూ సాం స్కృతిక సమైక్యతకు దోహదంచేసింది. ఇప్పుడు భారతదేశం బోధిస్తున్న వసుధైక కుటుంబానికి నాంది పలికింది. బౌద్ధం వర్ణవ్యవస్థలోని కాఠిన్యాన్ని తగ్గించి దళిత, పీడిత వర్గాల పరిస్థి తి మెరుగయ్యేందుకు దోహదపడింది.
అందుకే ఇది సనాతన ధర్మానికి అభిముఖంగా నిలిచిన పురాతన మానవీయ ధ ర్మం. అందువల్లనే ఆధునిక యుగంలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆ ర్ అంబేద్కర్ 5లక్షల మందితో అశోక విజయద శమి రోజున అక్టోబర్ 14న నాగపూ ర్‌లో బౌద్ధాన్ని స్వీకరించాడు. బౌద్ధాన్ని అస్పృశ్యవర్గాలకు ఒక విమోచన సాధనంగా భావించాడు. ఆ తర్వాత బౌద్ధం సరికొత్త పోరాటాలకు ఊపిరిలూదింది.
ప్రశ్నించే తత్వాన్ని బోధించింది. ఇప్పటికీ ప్రతి అంబేద్కర్ వాదికి బౌద్ధం దగ్గరై నా...ఆచరణలో దూరమైనది. నేడు కులతత్వం, మతతత్వం పెరిగిపోతున్న భారతదే శంలో బౌద్ధ జీవన విధానం అనుసరణీ యం. మరోవైపు మతం , ప్రాంతం, జాతు ల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి కూడా బుద్ధుని ప్రవచనాలు అవసరం.
బుద్ధుని బోధనలే శాస్త్రీయ పరిష్కారం...
గౌతమ బుద్ధుడు అనగానే అందరికీ ప్ర శాంతమైన ముఖం కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. అందుకే మానసిక నిపుణు లు సైతం ఇంట్లో గౌతమ బుద్ధుని ఫొటో పెట్టుకోవాలని సూచిస్తుంటారు. బుద్ధుడు చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ జీవితాలను ముందుకు నడిపించే పాఠంగా ఉంటుం ది. ఏ పని చేసినా మనస్సాక్షిగా చేయాలని బుద్ధుడు చెప్పాడు. అప్పుడే వారు తమ ఆ లోచనలు, భావోద్వేగాలు, పనులు గురిం చి స్పష్టంగా తెలుసుకోగలుగుతారు.
జీవితంలో ఏదీ శాశ్వతం కాదని బుద్ధుడు ఆ నాడే చెప్పాడు. అందుకే మనుషులు తోటి మనుషులపై ఈర్ష్య, ద్వేషాన్ని వీడాలి. అహంకారం మనిషి పతనానికి కారణమ ని, అహాన్ని వదిలిన రోజే నిజమైన విజయాన్ని సాధించినట్లనే శాస్త్రీయ తను బుద్ధుడు బోధించాడు. జీవితంలో మార్పు సహజమనే నిజాన్ని గుర్తించినప్పుడు దుఃఖం అనే మాటకు చోటే ఉండదన్నా డు.
ఈ అంతః సూత్రం తెలియక కోట్లాది ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. అంగీకరించడం, వదిలిపెట్ట డాన్ని అలవాటుగా మార్చుకున్నప్పుడే ముందు కు పోతామని బుద్ధుడి సూక్తులు చెపుతున్నాయి. ఆయన బోధనల్లో మరో ప్రధాన మైన అంశం అందరి పట్ల సానుభూతి, ద య కలిగి ఉండడం. ఇలాంటి వారు ఎదు టి వారిని ఇబ్బంది పెట్టరు, తమను తా ము ఇబ్బందులకు గురి చేసుకోరు.
తమ విముక్తికి ధర్మబద్ధమైన పొరా టం చేయాలని పిలుపునిచ్చా డు. భౌతిక సుఖాలపై వ్యామోహాలను వీడిన రోజే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందనే తాత్వికతను బుద్ధుడు తెలిపాడు. ఇలా ప్రకృతి లోని శాస్త్రీయతను చాలా చక్కగా చెప్పా డు. మనిషి బుద్ధి జీవిగా మారాలంటే బుద్దుని బోధనలు తెలుసుకోవా ల్సిందే. ఆచరించాల్సిందే.
చివరగా బుద్ధు డు దేవుడు కాదు. ఆయనది మతమూ కాదు. తనది ఆధ్యాత్మిక వాదం అంతకన్నా కాదు. బుద్ధుడు ఒక సంపూర్ణ మానవుడు. మానవుల దుఃఖ నిర్మూలన కోసం సం ఘాన్ని కట్టి, అంధకారంలో ఉన్న మనందరి కో సం మార్గదాతగా, దీప స్తంభంగా మారా డు. అందుకే ఆయన వైతాళికుడు.






