24-04-2025 02:14:56 AM
అనంత్‌నాగ్, ఏప్రిల్ 23: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సం స్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్‌గా గుర్తించారు. పహల్గాం ఉగ్ర దాడిని అతడే ప్లాన్ చేసినట్టు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. పాక్‌లోని పంజాబ్ ఫ్రావిన్స్‌కు చెందిన ఖలీద్ కరుడుగట్టిన ఉగ్రవాది అని తెలిపింది.
పహల్గాం దాడి వెనుక ఖలీద్‌తో పాటు పీవోకేకు చెందిన మరో ఇద్ద రు వ్యక్తులు కూడా ఉన్నారని ఎన్‌ఏఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. సైఫుల్లా కసూరికి ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్ ఆర్మీతో మంచి సత్సంబంధాలు ఉన్నట్టు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం అనంత్‌నాగ్ జిల్లాలోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వచ్చి ముష్కరులు విచక్షణారహిత కాల్పులు జరిపారు.