calender_icon.png 9 November, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైట్‌వాష్ గండం తప్పేనా?

11-12-2024 12:03:14 AM

నేడు ఆసీస్, భారత్ మూడో వన్డే

పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండు ఓటములతో ఢీలా పడింది. నేడు పెర్త్ వేదికగా జరగనున్న చివరి వన్డేలోనైనా గెలిచి క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని హర్మన్ సేన ఆరాట పడుతోంది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో విజయంతో భారత్ వైట్‌వాష్ గండం నుంచి బయటపడుతుందా అన్నది చూడాలి. టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోయింది.

తొలి వన్డేలో నలుగురు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ సాధించారు. సీనియర్లు స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. షఫాలీ వర్మ స్థానంలో ఓపెనర్‌గా వస్తోన్న రిచా ఘోష్ ఆకట్టుకోగా.. హర్లీన్ డియోల్, రోడ్రిగ్స్ పూర్తిగా విఫలమయ్యారు. బౌలింగ్ పర్వాలేదనిపస్తున్నప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హేలీ గైర్హాజరీలో తాహిలా మెక్‌గ్రాత్ జట్టును సమర్థంగా నడిపిస్తోంది. జార్జియా వోల్, ఎలీస్ పెర్రీ సూపర్ ఫామ్‌లో ఉండడం జట్టుకు సానుకూలాంశం.