calender_icon.png 10 November, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోకస్ మొత్తం షమీపైనే..

11-12-2024 12:06:40 AM

నేడు బెంగాల్, బరోడా క్వార్టర్ ఫైనల్

సయ్యద్ ముస్తాక్ టోర్నీ

బెంగళూరు: దేశవాలీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో నేడు బెంగాల్, బరోడా మధ్య క్వార్టర్ ఫైనల్ జరగనుంది. మ్యాచ్‌లో అందరి దృష్టి భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీపైనే నెలకొని ఉంది. వన్డే ప్రపంచకప్ అనంతరం గాయంతో ఇబ్బంది పడి జట్టుకు దూరమైన షమీ ఇటీవలే పూర్తి స్థాయిలో కోలుకొని రంజీ ట్రోఫీలో ఆడాడు. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తోన్న షమీ సయ్యద్ ముస్తాక్ టోర్నీ లోనూ అదరగొడుతున్నాడు.

ప్రిక్వార్టర్స్‌లో ఛండీగర్‌పై బెంగాల్ విజయం సాధించడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 17 బంతుల్లో 32 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ పడగొట్టాడు. ఓవరాల్‌గా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన షమీ 64 ఓవర్లు వేసి 12 వికెట్లు తీశాడు. అయితే ప్రత్యర్థి బరోడా టోర్నీలో అత్యంత బలంగా కనిపిస్తోంది. టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన బరో డాను బెంగాల్ ఓడించడం శక్తికి మించిన పని. మరో క్వార్టర్స్‌లో ఢిల్లీతో ఉత్తర్ ప్రదేశ్ అమీతుమీ తేల్చుకోనుంది.