10-12-2024 11:59:24 PM
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో మంగళవారం జైపూర్ పింక్ పాంథర్స్, బెంగాల్ వారియర్స్ భారీ విజయాలు నమోదు చేశాయి. పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగా ల్ వారియర్స్ 44 తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. బెంగాల్ తరఫున విశ్వాస్ (14 పాయిం ట్లు) సూపర్ టెన్ సాధించగా.. బెంగళూరు స్టార్ రెయిడర్ పర్దీప్ నర్వాల్ సూపర్ టెన్‌తో మెరిశాడు.
మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 42 29తో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. దేశ్వాల్ (13), నీరజ్ (8) జైపూ ర్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో జైపూర్ ఆరో స్థానానికి చేరుకోగా.. గుజరాత్ 11వ స్థానానికి పడిపోయింది. నేటి మ్యాచ్‌ల్లో హర్యానాతో బెంగళూరు, యు ముంబాతో తలైవాస్ తలపడనున్నాయి.