3 August, 2026 | 9:27 PM

పూర్తికాల అధ్యక్షుడు మోక్బరేనా?

21-05-2024 01:27 AM

టెహ్రన్, మే 20: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అకాల మరణం తో ఆ దేశ ఉపాధ్యక్షుడు మోహమ్మద్ మొక్బర్‌కు అనూహ్యంగా అధ్యక్ష కిరీ టం లభించింది. రైసీ మరణవార్త తెలియగానే మోక్బర్‌ను ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు మరో 50 రోజుల్లో దేశంలో ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పటివరకు మోక్బర్ అధ్య క్షుడిగా కొనసాగుతారు. పార్లమెంటు స్పీకర్, దేశ ప్రధాన న్యాయమూర్తి, ఉపాద్యక్షుడితో కూడిన కమిటీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు దేశం లో ఎన్నికలు నిర్వహిస్తుంది.

అయితే, మొదటి ఉపాధ్యక్షుడిగా ఉన్న మోక్బ ర్ ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడు అయినందున ఎన్నికల కమిటీలో రెండో ఉపాధ్యక్షుడు ఉంటారు. వచ్చే ఎన్నికల్లో మోక్బరా కూడా అధ్యక్ష పదవికోసం పోటీ చేయొచ్చు. 2021 నుంచి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న 68 ఏండ్ల మోక్బరా.. డెజ్‌ఫుల్ నగరంలో జన్మించారు. 2007 నుంచి ఆయన ఖొమేనీ ఆదేశాలను అమలుచేసే  ఎగ్జిక్యూషన్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ కమిటీ 1979 ఇస్లామిక్ విప్లవం సమయంలో ప్రభుత్వ ఆధీనమైన ఆస్తులను నిర్వహిస్తుంది.