పాత చాపరే కారణమా?
టెహ్రాన్, మే 20: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్ర హీం రైసీ మృతి వెనుక కారణాలపై జోరుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్‌తో ఘర్షణలు జరుగుతున్న నేప థ్యంలో హెలికాప్టర్‌ను ఆ దేశం కూల్చివేసిందా? ముందుగా అనుకొన్నట్టు వాతా వరణం అనుకూలంగా లేకపోవటం వల్లనే అది కూలిపోయిందా? లేదా దేశ అంతర్గత శత్రువులు ఎవరైనా కూల్చివేశారా అన్న కో నాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి. అయి తే, రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ పురాతనమైనదని, అందువల్లనే అది కూలిపోయి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ బెల్ 212 రకానికి చెందినది. ఇది వియత్నాం యుద్ధ కాలం నాటిది. ఈ రకం హెలికాప్టర్లను బెల్ హెలికాప్టర్స్ (ప్రస్తుతం బెల్ టెక్స్‌ట్రాన్) 1960వ దశకంలో కెనడా మిలిటరీ కోసం అభివృద్ధి చేసింది. ఆ తర్వాత దీనిలోనే కొన్ని మార్పులు చేసి యూహెచ్ 1ఎన్ ఇరోక్వోస్ పేరుతో తీసుకొచ్చింది. కొత్త వెర్షన్‌లో రెండు టర్బోషాఫ్ట్ ఇంజిన్లు ఉంటాయి. 1971లో మార్కెట్‌లోని వచ్చిన దీనిని అమెరికా, కెనడా విరివిగా వాడాయి. దీనిని బహుళ ప్రయోజనాల కోసం వాడుతారు.
ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను రక్షించేందుకు, అగ్నిప్రమాదాల సమయంలో ఆకాశం నుంచి మంటలు ఆర్పేం దుకు, కార్గో ఫెర్రీలను తరలించేందుకు, ఆయుధాలను జారవిడిచేందుకు కూడా వినియోగిస్తారు. రైసీ ప్రయానించిన చాపర్ ప్రభుత్వ అధికారులను తరలించేందుకు కొనుగోలు చేశారు. అయితే, ఇరాన్ వద్ద ఉన్న హెలికాప్టర్లన్నీ దశాబ్దాల కిందటివి. దేశంలో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆ దేశానికి ఆయుధ సంపత్తి అందకుండా చేసేం దుకు అమెరికా, యూరప్ దేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. దీంతో తన వద్ద ఉన్న హెలికాప్టర్లకు రిపేర్లు చేసేందుకు విడిభాగాలు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఇరాన్ ఉన్నది.
హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు
ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు పదవిలో ఉండగా వివిధ రకాల ప్రమాదాల్లో తనువులు చాలించారు. వారిలో కొందరు..
1. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 సెప్టెంబర్ 1న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈయన ప్రయాణించింది కూడా బెల్ కంపె నీ హెలికాప్టరే. బెల్ 430 రకం హెలికాప్టర్లలో కర్నూల్‌లో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వెళ్తుండగా ఉదయం 10 గంటల సమయంలో నల్లమల అడవుల్లో ఎర్రకాలువ వద్ద చాపర్ కూలిపోయింది.
2 మొహమ్మద్ జియా ఉల్ హక్
పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1988 ఆగస్టు 17న విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంపై ఇప్పటికీ వివాదా లున్నాయి. విమానం సాంకేతిక లోపంతో కూలిందా? ఎవరైనా కూల్చేశారా? అనేది తేలలేదు.
3. సెబాస్టియర్ పినేరా
చిలీ అధ్యక్షుడిగా పనిచేసిన పినేరా ఈ ఏడాది ఏడాది ఫిబ్రవరి 6న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దక్షిణ చిలీలోని ఓ సరస్సులో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. పినేరా తప్ప ప్రమాద సమయంలో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడటం విశేషం.
4. అర్విడ్ లిండ్‌మన్
అర్వింద్ లిండ్‌మన్ స్వీడన్ ప్రధానిగా పనిచేశారు. వాతావరణం సరిగ్గా లేకపోవటంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇంగ్లండ్‌లో కూలిపోయింది. దీంతో ఆయన స్పాట్‌లోనే చనిపోయారు.
5. అబ్దుల్ సలామ్
ఇరాక్ రెండో అధ్యక్షుడిగా పనిచేసిన సలామ్ 1966లో ఇరాక్ ఎయిర్‌ఫోర్స్ విమానం కూలిపోవటంతో 45 ఏండ్ల వయసులోనే మరణించారు. ఆయన ప్రయా ణించిన డీ హావిలాండ్ డీహెచ్ 104 డోవ్ విమానం బస్రాకు 10 కిలోమీటర్ల దూరం లో కూలిపోయింది. సాంకేతిక లోపాలే ఈ ప్రమాదానికి కారణమని తేలింది.
6. రషీద్ కరామీ
లెబనాన్ ప్రధానిగా పనిచేసిన రషీద్ ప్రయాణించిన భారీ హెలికాప్టర్‌లో ఆయన ప్రత్యర్థులు బాంబు అమర్చి పేల్చటంతో 1987లో మరణించారు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో 30 మంది ఉండగా, రషీద్ ఒక్కరే మరణించటం విశేషం.
7. బిపిన్ రావత్
భారత తొలి త్రివిధ దళాల జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న మిగ్ మీ 17 వీ హెలికాప్టర్ 2021లో తమిళనాడులోని కోయంబత్తూరు వెల్లింగ్టన్ మధ్య కూలిపోయింది. ఈ ప్రమాదంలో రావత్‌తోపాటు ఆయన సతీమణితో కలిపి మొత్తం 13 మంది మరణించారు. సంజయ్‌గాంధీ, మాధవ్‌రావు సింధియా, ప్రముఖ నటి సౌందర్య కూడా హెలికాప్టర్ ప్రమాదాల్లోనే మరణించారు.






