calender_icon.png 21 January, 2026 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారబలంతో అక్రమ అరెస్టులు చేయడమేనా ప్రజాపాలన?

21-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే విజయుడు

అయిజ జనవరి 20: నా కార్యకర్తలు లేనిది... ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే విజయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎమ్మెల్యే విజయుడు,ఎంపీ మల్లు రవితో కలిసి ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయాల్సి వస్తుండగా. ముందస్తుగా కాంగ్రెస్ నాయకులు వారికి అనుకూలంగా ఉండేలా.. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి పోలీసులు స్టేషన్కు తరలించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు,పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే చేరుకుని కార్యకర్తలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో అక్రమంగా అరెస్టులు చేయడమే ప్రజా పాలన అని మండిపడ్డారు.