calender_icon.png 21 January, 2026 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై జాగ్రత్తే ప్రజల జీవన భద్రత

21-01-2026 12:00:00 AM

  1. డీఎస్పీ వంగా రవీందర్‌రెడ్డి

రోడ్డు భద్రతపై వాహనదారులకు పోలీసుల అవగాహన 

మణుగూరు, జనవరి 20 (విజయక్రాంతి):  రోడ్డుపై జాగ్రత్తే ప్రజల జీవన భద్రత అని డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి అన్నారు. ఆలైవ్, అరైవ్, పది రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రత ట్రాఫిక్  నియమాలపై మంగళవారం స్థానిక పూలమార్కెట్ ఏరియాలోని ప్రధాన రహదారి పై ఆటో డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా డీఎస్పీ రవీందర్ రెడ్డి పాల్గొని, రోడ్డు భద్రతపై ప్రజలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వాప్తంగా ప్రారంభించిన ‘అరైవ్ అలైవ్’ ప్రోగ్రామ్ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం గా తీసుకున్న ముఖ్యమైన చర్యగా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు దెబ్బతింటాయని, ప్రతి రోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకుని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరి పెరగా లని సూచించారు.

మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదలకు కారణాలని చెప్పారు. ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాన్ని చూసిన వెంటనే సహాయం చేసే వారికి పోలీసులు ప్రోత్సహాకాలు అందిస్తున్నట్లు తెలిపారు. యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొం దిచడమే కాకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు. అందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సిఐ పాటి నాగబాబు, ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది, అధిక సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు.