14 July, 2026 | 11:20 PM

నేల మీది నక్షత్రమా..

09-12-2024 12:36 AM

ధర్మ, ఐశ్వర్యశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్‌లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ‘నేల మీది నక్షత్రమా..’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నేల మీది నక్షత్రమా.. ఆకాశమంత చిలిపితనం.. అంతరిక్షమంత పసితనం.. మేఘమాల లాంటి పడుచుతనం.. మధ్యలోనే ఉరిమే గడుసుతనం...’ అంటూ సాగే ఈ మెలోడీ శ్రోతల్ని ఆకట్టుకుంటోంది. దీనికి శ్రీవసంత్ సంగీతం సమకూర్చగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. అనుదీప్ దేవ్ పాడారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్‌ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: లావణ్య వేములపల్లి; డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి; ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేశ్; నిర్మాణం: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్; రచన, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి.