calender_icon.png 3 February, 2026 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ పురుగు ధర రూ.75 లక్షలు?

23-02-2025 12:00:00 AM

సహజంగా మనకు కనిపించే ప్రతి పురుగు హాని చేస్తుందని.. అవి కుడితే.. ప్రమాదం అని భావించి.. వెంటనే చంపేస్తాం. కానీ ఈ భూమ్మీద మనకు మంచి చేసే పురుగులు కూడా ఉంటాయని మీకు తెలుసా? వాటిని చికిత్సల్లోనూ వాడతారు. మనం ఇవాళ తెలుసుకునే పురుగు చాలా కాస్ట్లీ. దాని విలువ దాదాపు ఓ లగ్జరీ కారు ధరకు సమానం.

అవును ఇది నిజమే. ఆ పురుగు విలువ ఏకంగా రూ.75 లక్షలు ఉంటుందట. దానిపేరు స్టాగ్ బీటిల్. ఈ పురుగు ఒక్క రోజులో మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది. ఎందుకంటే ఆ పురుగు అత్యంత అరుదైనది. దీన్ని అదృష్టానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. ఈ పురుగు చెక్కలపై ఆధారపడి జీవించే కీటక జాతికి చెందినది.

అటవీ పర్యావరణంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. లండన్‌కు చెందిన ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ ప్రకారం.. ఈ పురుగు బరువు రెండు నుంచి ఆరు గ్రాముల మధ్యలో ఉంటుంది. ఇది మూడు నుంచి ఏడు సంవత్సరాలు జీవిస్తుంది. ఈ 

పురుగు కొండీలు దుప్పిల కొమ్ములను పోలి ఉండటంతో వీటికి ‘స్టాగ్ బీటిల్స్’ అనే పేరు వచ్చింది. స్టాగ్ బీటిల్స్ ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తాయి. వీటికి చలి పడదు. ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. ఇవి మొక్కలకు హాని చేయవు.