యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో హత్య
06-12-2024 02:24 AM
న్యూయార్క్, డిసెంబర్ 5: అమెరికాలో మరో దారుణం జరిగింది. దేశంలో పేరుపొందిన ప్రముఖ బీమా సంస్థ యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్‌ను న్యూయార్క్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మిడ్ టౌన్‌లోని హిల్టన్ హోటల్ బయట ఆయనపై ముఖానికి మాస్కుతో వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఆయన చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
అదే హోటల్‌లో ఇన్వెస్టర్ డే కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొనాల్సి ఉందని బీమా కంపెనీకి చెందిన ప్రతినిధి ఆండ్రూ విట్టీ పేర్కొన్నారు. అయితే బ్రియాన్ హత్యకు కారణాలు ఏమిటనేది తెలియ రాలేదు. హంత కుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.






