సెప్టెంబర్ 1 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
25-08-2024 01:57 AM
- 14న మొదటి విడత సీట్ల కేటాయింపు
- 25న సీట్ల కేటాయింపు
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): తెలంగాణ ఐసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు అయ్యాయి. త్వరలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నతా విద్యాశాఖ చైర్మన్ ప్రొఫెసర్ లింబాంద్రి శనివారం మీడియాకు తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు కౌన్సెలింగ్ ఉంటుందని, 14న మొదటి విడత సీట్ల కేటాయిస్తారు. సెప్టెంబర్ 20న ఫైనల్ కౌన్సెలింగ్, 25న తుది విడత సీట్ల కేటాయింపు, 27న స్పాట్ అడ్మిషన్లు ఉండనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఐసెట్ కోసం 86,514 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో సుమారు 77,942 మంది ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు.






