16 April, 2026 | 8:13 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇస్ప్కాన్ 2026

07-02-2026 01:07 AM
  1. హాజరైన జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు
  2. నొప్పి నివారణలో ఆధునిక విధానాలపై సూచనలు

హైదరాబాద్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి) : ఇండియన్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ పెయిన్ (ఇస్ప్కాన్ 2026) 40వ వార్షిక సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సదస్సులో భారతదేశం నలుమూలలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నొప్పి నివారణ నిపుణు లు, క్లినీషియన్లు, పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సదస్సును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ తాజా మాజీ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుశాలి ప్రారంభించారు.

అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూ ట్, సిటిజన్ ఆస్పత్రుల ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ పాలచర్ల ప్రభాకర్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఐఎస్‌ఎస్పీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కృష్ణ పొద్దార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఆఫ్ స్టడీ ఆఫ్ పెయిన్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు, ఆర్గనై జింగ్ సెక్రటరీ డాక్టర్ నాగలక్ష్మి పట్నాల వ్యవహరించారు.

పలు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రధానంగా వివిధ విభాగాల మధ్య సమన్వయం, నొప్పి నివారణలో ఇంటర్వెన్షనల్, ఫార్మకలాజికల్ ఆధునిక విధానాలు, దీర్ఘకాల నొప్పి నివారణకు బయో-సైకో-సోషల్ విధానం గురించి చర్చించారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు కలిసి రోగుల పరిస్థితిని మెరుగుపరచడంలో స్థానిక అంశాల గురించి వివరించారు. తీవ్రమైన, దీర్ఘకాల నొప్పులతో బాధపడుతున్న రోగుల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు విజ్ఞానం, ఆవిష్కరణలను మరింత బ లోపేతం చేసేందుకు ఇస్ప్కాన్ 2026 దృష్టిపెట్టిందని నిర్వాహకులు తెలిపారు.