16 April, 2026 | 6:27 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మీ బిడ్డగా ఆదరించండి...

07-02-2026 01:08 AM

వార్డు అభివృద్ధి నా బాధ్యత 

7వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి లత సూరన్న గారి 

భూత్పూర్, ఫిబ్రవరి 6 :  మీ బిడ్డగా మీ ముందుకు వచ్చా..... ఆదరించండి....ఆశీర్వదించండి....కౌన్సిలర్ గా గెలిపించండి ఈ ప్రాంత అభివృద్ధి తన అభిబతంగా పని చేస్తానని 7వ వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న లత సూరన్న గారి అన్నారు. శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి ఆమె వార్డు పరిధిలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా లత సూరన్న గారి మాట్లాడుతూ మీ బిడ్డను మీ ఇంటి పక్కనే ఉంటా ఏ వేళలో ఏ సమస్య వచ్చినా మీ ముందుకు వస్తా సమస్య పరిష్కారానికి కృషి చేస్తా మన వార్డు అభివృద్ధి కోసం తనను గెలిపించాలని ఆమె కోరారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో వెనుకబడ్డ ఏడవ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని  పేర్కొన్నారు. మీ అందరి సహకారంతో ఏడవ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని, 11న జరగనున్న ఎన్నికల్లో బిజెపి గుర్తు కమలం గుర్తుకు ఓటు వేసి ఏడవ వార్డు కౌన్సిలర్ గా తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.