16 April, 2026 | 10:08 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట

07-02-2026 01:04 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి ఫిబ్రవరి 6: అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే విద్య, వైద్యం అత్యంత కీలకమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తూ ముందుకెళ్తోందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించి ఓటర్లను కలుసుకుని మాట్లాడుతూ, అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకొని సమాన అవకాశాలు పొందాలనే లక్ష్యంతో గురుకుల వి ద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమీకృత గురుకులాలను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్య అందిస్తున్నామని వివరించారు.అదేవిధంగా పేద ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యం అందిస్తూ ప్రతి ఒక్కరి ఆకలి , తీర్చడం జరుగుతుందన్నారు . ముఖ్యమంత్రి సహకారంతో కల్వకుర్తి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ రామిరెడ్డి, పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.