16 March, 2026 | 12:54 PM

యెమెన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

21-07-2024 01:21 AM

టెల్ అవీవ్, జూలై 20: హుతీ తీవ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ తీవ్ర ప్రతీకార దాడులకు దిగింది. శుక్రవారం ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో దాడి చేసిన యెమెన్‌లోని ఉగ్రవాద స్థావరాలపైకి శనివారం ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసింది. యెమెన్‌లోని హొడీడా నౌకాశ్రయంపై ఇజ్రా యెల్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఇజ్రాయెల్ ప్రధాన భూభాగానికి ఈ పోర్టు 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ దాడిలో ఎవరైనా మరణించిందీ లేనిది తెలియరాలేదు.