1 July, 2026 | 1:30 AM

చిన్నారి భవిత చికిత్సకు కేటీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం

01-07-2026 12:40 AM

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మొయినాబాద్, జూన్ 30 (విజయక్రాం తి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన చిన్నారి భవిత గొంతులో టాన్సిల్స్ సమస్యతో గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలి దానం చేసిన యాదిరెడ్డి కుటుంబాన్ని ఇటీవల మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్లతో కలిసి కేటీఆర్ పరామర్శించా రు.

ఈ సందర్భంగా యాదిరెడ్డి సోదరు డు ఓంరెడ్డి కుమార్తె భవిత టాన్సిల్స్ సమస్యతో బాధపడుతోందని, శస్త్రచికిత్స అవసరమని కుటుంబ సభ్యులు వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్, వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచిస్తూ అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు రో జుల వ్యవధిలోనే రూ. లక్ష ఆర్థిక సహాయా న్ని అందజేశారు. ఆర్థిక సహాయంతో మంగళవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి భవితకు విజయవంతంగా టాన్సిల్స్ శస్త్రచికిత్స నిర్వహించారు.

ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగుపడుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా భవిత తండ్రి ఓంరెడ్డి మాట్లాడుతూ, తమ కుటుం బ పరిస్థితిని అర్థం చేసుకుని ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఆర్థిక సాయం అందించిన కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమార్తె ఆరోగ్యంగా కోలుకునేలా సహకరించినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు.