20 March, 2026 | 3:07 AM

ఇజ్రాయెల్ ఇకపై దాడులు చేయదు

20-03-2026 01:24 AM
  1. ఆ దాడికి మాకు సంబంధం లేదు
  2. మా మిత్రదేశాలపై ప్రతీకారం వద్దు
  3. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి 19 : మధ్యప్రాచ్యంలో పరస్పర దాడుల కారణంగా ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, ఇరాన్‌లోని కీలకమైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ ఇకపై దాడులు చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ గురువారం తెలిపారు. అదే సమయంలో, ఖతార్ ఇంధ న మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవద్దని టెహ్రా న్‌ను హెచ్చరించారు.

మధ్యప్రాచ్యంలో జరిగిన పరిణామాలపై ఆగ్రహంతో ఇజ్రాయెల్, ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై భీకర దాడి చేసిందని ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. సౌత్ పార్స్ దాడులు కేవలం ఇజ్రాయెల్ చర్య మాత్రమేనని పేర్కొంటూ, ఆ దాడితో వా షింగ్టన్‌కు సంబంధం లేదని స్పష్టం చేయడానికి ట్రంప్ వెంటనే ప్రయత్నించారు.

ఈ ప్రత్యేక దాడి గురించి అమెరి కాకు ఏమీ తెలియదని, ఖతర్ దేశానికి దీనితో ఏ విధంగా నూ, ఏ రూపంలోనూ సంబంధం లేదని, అలాగే ఇది జరగబోతోందని కూడా దానికి ఏమాత్రం తెలియదని ఆ యన వెల్లడించా రు. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు(ఎన్‌ఎల్‌జీ) క్షేత్రమైన సౌత్ పార్స్‌పైన బుధవారం జరిగిన బాంబు దాడికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్‌లోని ఐదు ఇంధన కేంద్రాలపై రాబో యే గంటల్లో లక్ష్యంగా మారుతాయని ఇరా న్ ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఇరాన్ ప్రభుత్వం ఖతార్ ఇంధన కేంద్రాలపై దాడులు కొనసాగిస్తే, మొత్తం సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని పేల్చివేస్తామని ఇరాన్‌ను బెదిరిస్తూ, ఉద్రిక్తతలను మరింత పెంచవద్దని ట్రంప్ అన్నారు. 

ప్రపంచానికి ఇది పరీక్షా సమయం 

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కేవలం దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి పరీక్షగా మారాయని భారత ప్రభుత్వం పేర్కొంది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని గురువారం తెలిపింది. దేశ ఇంధన అవసరాలు తీరేలా సంబంధిత దేశాలతో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సహా వివిధ విభాగాల ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు. 

పలు దేశాధినేతలకు మోదీ ఫోన్

ఇరాన్, యూఎస్-ఇజ్రాయెల్ మధ్య న డుస్తున్న యుద్ధ ఉద్రిక్తతలు తగ్గడానికి ప్రధాని మోదీ అనేక దేశాధినేతలకు గురువారం ఫోన్‌చేశారు. ఒమన్ సుల్తాన్, మలేషి యా ప్రధాని అన్వర్‌ఇబ్రహీం, ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడారు. ఘర్షణలు తక్షణమే తగ్గించాల్సిన తీరుపై చర్చించారు. ఒమన్ సుల్తాన్ హైతమ్‌బిన్‌తారిక్‌తో మాట్లాడినట్లు ఎక్స్‌లో మోదీ పోస్టు చేశారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలు క్షేమంగా వెళ్లే అంశంపై ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు.