28 June, 2026 | 3:01 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

16-11-2024 01:11 AM

12 మంది వైద్య సిబ్బంది మృతి

బీరూట్, నంబర్ 15: తూర్పు లెబనాన్‌లోని బాల్‌బెక్ గ్రామంలోని సివిల్స్ డిఫెన్స్ సెంటర్‌పై గురువా రం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 12మంది వైద్య సిబ్బంది చనిపోయారని, ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని లెబనీస్ తెలిపింది. వైమానిక దాడిలో కూలిపోయిన భవనం వద్ద శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
సెప్టెంబర్ 23 నుంచి ఇజ్రాయెల్ సైన్యం హెజబొల్లాతో వివాదానిన తీవ్రతరం చేయడంతో లెబనాన్‌పై వైమానిక దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ ప్రారంభంలో ఇజ్రాయెల్ తన ఉత్తర సరిహద్దు మీదుగా లెబనాన్‌లోకి గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది.