27 July, 2026 | 9:49 PM

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

27-07-2026 09:12 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, బీసీ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనంగా ప్రభుత్వ కళాశాల హాస్టళ్లను కేటాయించాలని, ప్రతి ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్‌ కు ఏఎన్‌ఎం లను నియమించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం  కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాకు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా DYFI జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ, బీసీ విద్యార్థుల సంఖ్యకు సరిపడా ప్రభుత్వ కళాశాల హాస్టళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అదనంగా ఎస్సీ, బీసీ కళాశాల హాస్టళ్లను వెంటనే కేటాయించి, వాటిలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.