లింగంపల్లిలో ఉచిత వైద్య శిబిరం
27-07-2026 09:17 PM
మునిపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వస్వందన లభించింది. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన రోగులకు వైద్యులు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అంతకు ముందు వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఇర్ఫాన్ పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిపిఓ చాపల రాజు, నాయకులు అప్సర్, వలిముద్దీన్, తాజుద్దీన్, దానిష్ పటేల్, కలీమ్, గ్రామపెద్దలు, మహిళలు పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.






