27 July, 2026 | 9:42 PM

ఆటో కారు ఢీ: ముగ్గురికి తీవ్ర గాయాలు

27-07-2026 09:10 PM

మనోహరాబాద్,(విజయక్రాంతి): మనోహరాబాద్ మండలం దండుపల్లి ఫారెస్ట్ శాఖ కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మనోహరాబాద్ వైపు నుండి మేడ్చల్ వైపు వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడం జరిగింది. దీంతో ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియాల్సి ఉన్నది.