12-12-2025 01:44:10 AM
మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందుకే చాలా మంది కుర్ర హీరోలు ఈ ముద్దుగుమ్మతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ భామ హీరోయిన్‌గా తెలుగులో నటించిన తొలిచిత్రం ‘ఇచట వాహనములు నిలుపరాదు’.
అక్కినేని యువ హీరో సుశాంత్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమా టైమ్‌లో సుశాంత్, మీనాక్షి మధ్య ప్రేమ చిగురించిందని, కొంతకాలంగా ఈ జంట రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారంటూ వార్తలొచ్చాయి. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై మీనాక్షి స్పందించింది. “సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
వాళ్లు ఫేమస్ కావడం కోసం, వ్యూస్ కోసం చాలా రాస్తూ ఉంటారు. వాటిలో చాలా వరకు అసత్యాలే.. అవన్నీ కామన్ అయిపోయింది. ఇప్పుడు నా రిలేషన్ గురించి వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు. ఏదైనా ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తా” అని చెప్పింది మీనాక్షి చౌదరి. ఇక మీనాక్షి సినిమాల విషయాకొస్తే.. ఆమె కథానాయకిగా నటించిన ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రం 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు మారి తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’లోనూ మీనాక్షినే హీరోయిన్.