calender_icon.png 12 December, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా?

12-12-2025 01:43:40 PM

అంఖండ-2 మరోసారి హైకోర్టు ఫైర్ 

హైదరాబాద్: అంఖండ- 2(Akhanda-2 ) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సింగిల్ బెంచ్ లో విచారణ జరిగింది. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సింగి బెంచ్ నిన్న రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరలను యథావిధిగా పెంచి విక్రయాలు చేశారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. బుక్ మై షో, ఆన్ లైన్ లో టికెట్ ధరలను పెంచి విక్రయించారని పిటిషనర్ల న్యాయవాదులు ఆరోపించారు. టికెట్ ధరల పంపుపై సింగిల్ బెంచ్ ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి సినిమాకు టికెట్ ధరలు పంచుతూపోతున్నారని సింగిల్ బెంచ్ మండిపడింది.

ధరలు పెంచాల్సిన పరిస్థితి ఎందుకు ఉందని సింగిల్ బెంచ్ ప్రశ్నించింది. అఖండ-2 నిర్మాతలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా?.. ఆదేశాలు ఇచ్చినా టికెట్లు ఆన్లైన్లో ఎందుకు విక్రయిస్తున్నారు? అంటూ హైకోర్టు బుక్ మైషోను ప్రశ్నించింది. ఉత్తర్వులు అందేలోపు ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని బుక్ మైషో కోర్టుకు తెలిపింది. ఇప్పుడు పెంచిన రేట్లతో ఆన్లైన్లో విక్రయిస్తున్నారా?.. లేదా?.. మీపై ఎందుకు కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోకూడదో చెప్పండని హైకోర్టు ప్రశ్నించింది.