వచ్చేసింది..శకుంతలక్కయ్య!
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ‘శకుంతలక్కయ్యా..’ అనే పాటను మంగళవారం రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న బాణీకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, ఉమా నేహా పవర్ ఆలపించారు. పర్ఫెక్ట్ పార్టీ సాంగ్‌గా కనిపిస్తున్న ఈ గీతంలో మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి డీవోపీ: మల్లికార్జున్ ఎన్; ఎడిటర్: అవినాష్ గుర్లింక్; ఆర్ట్ డైరెక్టర్: బేబీ సురేశ్; స్టంట్స్: డ్రాగన్ ప్రకాశ్.






