5 July, 2026 | 12:13 PM

మునుపెన్నడూ చూడని పాత్రలో..

24-12-2024 12:00 AM

ష్మిక మందన్నా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు తలుపు తట్టడంతో క్షణం తీరిక లేకుండా పని చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘థామా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాకు జంటగా రష్మిక నటిస్తోంది. దినేశ్ విజన్ హారర్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్నారు. రష్మిక ఇటీవలే సెట్స్‌లోకి అడుగు పెట్టింది.

ప్రస్తుతం రష్మికపై పరిచయ సన్నివేశాలను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రష్మిక పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందట. మునుపెన్నడూ చూడని పాత్రలో రష్మిక నటిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆయన కూడా త్వరలోనే షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీ షెడ్యూల్ అవగానే తదుపరి షెడ్యూల్‌ను ఫిబ్రవరిలో ఊటీలో మొదలు పెడతారని సమాచారం. 2025లో దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం రష్మిక ఈ చిత్రంలోనే కాకుండా ‘ది గర్ల్‌ఫ్రెండ్, కుబేర, సికిందర్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.