1 April, 2026 | 1:55 AM

బస్సులలో 2.64 కోట్ల ప్రయాణాలకుగాను రూ.142 కోట్లు ఆదా కావడం ఆనందం

01-04-2026 12:15 AM

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ 

దేవరకొండ, మార్చి 31 : దేవరకొండ డిపో పరిధి బస్సులలో 2.64  కోట్ల ప్రయాణాలకు గాను రూ.142 కోట్లు ఆదా కావడం ఆనందనీయం అని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నా రు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ - దేవరకొండ ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేష్, మార్కెట్ కమిటి చైర్మన్ నాయిని జమునా మాధవరెడ్డి, ఆర్.ఏం (ఏం) నల్లగొండ భీంరెడ్డి, డీఎం విజయ కుమారి, వార్డు కౌన్సిలర్ గాజుల సావిత్రి, ఆర్టీసీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.