క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ
01-04-2026 12:16 AM
యాదగిరిగుట్ట, మార్చి 31 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో గల ఆంజనేయ స్వామికి అర్చక బృందం మన్య సూక్త పారాయణముతో అభిషేకం చేశారు.
సింధూరంతో అలంకరించిన స్వామివారికి వివిధ రకాల సుగంధం వెదజల్లే ద్రవ్యాల పూలమాలలతో అలంకరించి నాగవల్లి దలార్చన నిర్వహించారు. ఆకు పూజలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




