15 June, 2026 | 10:21 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

గూండాలను పెంచి పోషిస్తున్నది కేటీఆరే

18-02-2026 01:33 AM

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): మంత్రి వివేక్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఖండించారు. ‘వీధి గూండాలని కేటీఆర్ పెంచి పోషిస్తున్నాడని, క్యాతనపల్లిలో బాల్క సుమన్ రౌడీయిజం చేస్తున్నాడని ఫైర్‌అయ్యారు. ‘ఎంపీగా బాల్క సుమన్ పనిచేసినా కూడా చిల్లర పనులు మానుకుంట లేవు.

మంత్రి కాన్వాయ్ పై రాళ్లదాడి చేస్తావా? చెన్నూరు ప్రజలు నీకు గతంలో అవకాశం ఇచ్చింది దేని కి. రౌడీయిజం.. గూండాయిజం చెయ్యడానికా? 2023లో చెన్నూ రు ప్రజలు నీకు బుద్ధి చెప్పిన సిగ్గు రాలేదు. ప్రజా ప్రభుత్వంలో నీలాంటి ధగా కోర్ రౌడీలకు ఆస్కారం లేదు. ఇప్పటికైనా నీ సుతి, మతి మార్చుకో’ అంటూ హెచ్చరించారు.