13 July, 2026 | 8:14 PM

Breaking News

భూముల రీ సర్వేతో భవిష్యత్తులో వివాదాలు ఉండవు   •   జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా కోదాడ వాసి సాయిశర్మ   •   నూలు పురుగుల నివారణకై మాత్రలు పంపిణీ చేసిన చైర్మన్ రాధాకృష్ణ   •   జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి   •   బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు   •   శ్రీ సోమలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   మంథని అభివృద్ధిలో మరో ముందడుగు   •   నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద నర్సింగ్ అభ్యర్థుల ధర్నా మద్దతు తెలిపిన ఆర్. కృష్ణయ్య డిమాండ్   •   చిన్నారుల ఆరోగ్యానికి నులిపురుగుల నివారణే రక్ష   •   రాజన్న ఆలయాభివృద్ధికి అమెరికా ప్రవాస కుటుంబం చేయూత   •  

మహిళా సంఘాలకు అవార్డులు లభించడం గర్వకారణం

01-04-2026 09:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా మహిళా సంఘాలకు ఇటీవలి రాష్ట్ర స్థాయి అవార్డులు లభించినందుకు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ను ఆ శాఖ ఉద్యోగులు  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను, సిబ్బందిని శాలువాలతో సన్మానించి, అభినందించారు.

అధికారులు, సిబ్బంది చేసిన కృషి గొప్పదని హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ, జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడపాలని అన్నారు. అవార్డులు సాధించేలా ప్రోత్సహించినందుకు కలెక్టర్ కు అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.