తెలంగాణలో కొనసాగాలనుకోవడం అర్ధరహితం
17-10-2024 03:38 AM
బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): క్యాట్, డీఓపీటీ ఆదేశాలను పట్టించుకోకుండా ఐఏఎస్‌లు తెలంగాణలోనే కొనసాగాలనుకోవడం అర్ధరహితమని బీఆర్‌ఎస్ సీని యర్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలని డీఓపీటీ ఆదేశించినా ఐఏఎస్‌లు హైకో ర్టుకు వెళ్లడంపై ఆయన బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. డాక్ట ర్లు, టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగు లు తమకు ఎలాంటి వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నా.. వారు బదిలీ ఆదేశాల ను పాటిస్తారని చెప్పారు. ఐఏఎస్‌లకు ఈ మినహాయింపు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.






