19-11-2025 11:25:29 AM
హైదరాబాద్: భాగ్యనగరంలో రెండో రోజు ఆదాయపన్ను శాఖ అధికారులు(Income Tax raids) దాడులు చేస్తున్నారు. పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ హోటళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఐటీ బృందాలు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్ర నగర్ పిస్తా హౌస్ ఓనర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాలు, లాకర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. షాగౌస్, మెహిఫిల్ లోనూ పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో రికార్డుల్లో అవకతవకలు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం నాడు 15 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.