19-11-2025 10:55:33 AM
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న భారత సంతతికి చెందిన టెక్నీషియన్‌ను కారు ఢీకొట్టడంతో ఆమె తన కడుపులోని బిడ్డతో సహా మరణించింది. గత వారం శుక్రవారం స్థానిక సమయం రాత్రి 8 గంటల తర్వాత హార్న్స్‌బైలోని జార్జ్ స్ట్రీట్ వెంబడి 33 ఏళ్ల సమన్విత ధరేశ్వర్ తన భర్త, వారి మూడేళ్ల కొడుకుతో కలిసి కార్‌పార్కింగ్ వెలుపల ఉన్న ఫుట్‌పాత్‌ను దాటడానికి వెళుతుండగా కార్ పార్కింగ్ ప్రవేశద్వారం వద్ద కియా కారు వేగం తగ్గించింది.
19 ఏళ్ల ఆరోన్ పాపజోగ్లు నడుపుతున్న బీఎండబ్ల్యూ సెడాన్ కారు, కియా కారును వెనుక నుండి ఢీకొట్టింది. గాయపడిన గర్భిణికి పారామెడిక్స్ అక్కడికక్కడే చికిత్స అందించిన తర్వాత ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మరణించింది. ఈ ప్రమాదానికి కారణమైన ఆరోన్ పాపాజోగ్లును శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన ధరేశ్వర్ సిడ్నీలో ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నారు. ఆమె, ఆమె టెక్నీషియన్ భర్త వినీత్ గ్రంథం ఫామ్‌లో భూమిని కొనుగోలు చేసి రెండంతస్తుల ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ధరేశ్వర్‌ను ఢీకొట్టిన మరో కారు డ్రైవర్ బెయిల్‌పై విడుదల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.